పారిశ్రామిక వేత్తలుగా గిరిజన బిడ్డలు...

మన రాష్ట్ర గిరిజన శాఖ దేశంలోనే రోల్ మోడల్ గా ఉండే సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులు అంటే గతంలో ఫ్యాక్టరీలలో, హోటళ్లలో పనిచేసే వారని, నేడు సిఎం కేసిఆర్ గారి సిఎంఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా మారి మరో పదిమందికి పని కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు.


సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద ఎంపికై ఐఎస్ బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సహకారంతో తేజావత్ ప్రతాప్ సింగ్, దాదాపు కోటి 13 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీ బృందావన్ రెస్టారెంట్ , బంకెట్ హాల్ ను నేడు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి పథకం కింద ఈ ఏడాది 100 మంది గిరిజనులను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నామని, ఇలా లబ్దిపొంది పారిశ్రామికవేత్తలుగా మారుతున్న గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఒక్కొక్కరు మరో 10 మందికి స్పూర్తిగా నిలవాలని, విజయవంతంగా ఈ సంస్థలను నడుపుకోవాలని ఆకాంక్షించారు.